హైదరాబాద్: 28°C
వార్తలు

కెజీబీవీ పాఠశాలను సందర్శించిన సివిల్ జడ్జి!

VZM: కొత్తవలస సివిల్ జడ్జి డా ఎస్. విజయ్ చందర్ గురువారం కెజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టార్‌లో సరుకుల నిల్వలు, వాటి కాలపరిమితిని పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆనంతరం విద్యార్ధులతో మమేకమై చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టీ అనుకొన్న లక్ష్యాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ విజయకుమారి ఉన్నారు.