హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇంటింటికీ టీడీపీ' 100% పూర్తి

BPT: అద్దంకి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామం 100% పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. గ్రామంలోని 8 పోలింగ్ బూత్‌ల పరిధిలోని 2,619 ఇళ్లలో 'మై టీడీపీ' యాప్ సర్వేను విజయవంతంగా పూర్తి చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఈ కార్యక్రమాన్ని 100% పూర్తి చేసిన తొలి గ్రామంగా నిలిచింది.