కేరళంలో బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాలకు అవమానం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. కాసర్‌గోడ్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఓ మూలన పలు త్రివర్ణ పతాకాలు కుప్పగా ఉన్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కుంబళలో తిరంగా యాత్ర బీజేపీ జిల్లా కమిటీ నిర్వహించిన అనంతరం జాతీయ జెండాలను నిర్లక్ష్యంగా పడేసినట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది.
వార్తలు
బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాకు అవమానం!


