హైదరాబాద్: 28°C
వార్తలు

తీజ్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క

MLG: ములుగు మండలం జగ్గన్నపేట పంచాయతీ సారంగపల్లిలో గురువారం బంజారాల తీజ్ పండుగ వేడుకల్లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, జాతి మూలాలను గౌరవిస్తూ పండుగలు జరుపుకోవడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, సర్పంచ్ అర్రెం వెంకన్న తదితరులున్నారు.