హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు ఎల్‌నినోపై అవగాహన సదస్సు

NDL: ప్యాపిలి మండలంలోని మునిమడుగు, నేరేడుచర్ల, జక్కసాని కుంట్ల, రైతు సేవా కేంద్రాల్లో ఎల్‌నినో పరిస్థితిని రైతులు ఏ విధంగా ఎదుర్కోవాలో అవగాహన సదస్సు నిర్వహించారు. నీటి ఎద్దడికి తట్టుకునే కంది, కొర్ర, సజ్జలు, వంటి రకాలు మాత్రమే సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రమణయ్య, ఆదినారాయణ, బాలరాజు, ఏఈవో మధుసూదన్ పాల్గొన్నారు.