హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రమాదం జరిగితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి: NHAI

దేశవ్యాప్తంగా NHAI పరిధిలో ప్రస్తుతం 50వేల కి.మీ మేర జాతీయ రహదారులున్నాయని అధికారులు తెలిపారు. వీటిపై 3000 అంబులెన్సులు, 1000 పెట్రోలింగ్‌ వాహనాలు, క్రేన్లు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో హైవేపై ఎక్కడైనా ప్రమాదం జరిగితే హెల్ప్‌లైన్ నెంబర్ 1033కి కాల్ చేయాలని సూచించారు. కాల్ చేసిన 10 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుందని వెల్లడించారు.