హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డుపై గుంత.. ప్రమాద ముప్పు

RR: కేశంపేట–షాద్‌నగర్ మార్గంలోని వేములనర్వ సమీపంలో రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. దూరం నుంచి గుంత కనిపించకపోవడంతో వేగంగా వచ్చే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు. అధికారులు వెంటనే గుంతను పూడ్చి, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని కోరారు.