హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పర్యటన

KDP: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. పులివెందులలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి కడపలో బస చేస్తారు. ఆగస్టు 15న కడపలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు బనగానపల్లికి బయలుదేరుతారని అధికారులు తెలిపారు.