హైదరాబాద్: 28°C
వార్తలు

సుఖ్‌బీర్‌పై దాడి.. విచారణకు సీఎం ఆదేశం

మహారాష్ట్ర నాందేడ్‌లోని గురుద్వారాలో అకాలీదల్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సుఖ్‌బీర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం దేవేంద్ర దాడికి గల కారణాలపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.