హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: విరూపాక్షి బెయిల్ పిటిషన్‌పై వాదనలు

KRNL: ఆదోని సెకండ్ క్లాస్ కోర్టులో ఎమ్మెల్యే విరూపాక్షి అట్రాసిటీ కేసు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. హైకోర్టు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి విరూపాక్షితో పాటు మరో 20 మందికి బెయిల్ కోరుతూ.. పిటిషన్లు దాఖలు చేశారు. ఉదయం వాదనలు విన్న కోర్టు తొలుత విచారణను సాయంత్రం 5 గంటలకు వాయిదా వేసింది. అనంతరం విచారణను ఈ నెల18వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది.