KRNL: మంత్రాలయం రాఘవేంద్ర కూడలిలో సీఐ దస్తగిరి బాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిని కిందికి దించి అవగాహన కల్పించారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రైవర్లను హెచ్చరించారు.
వార్తలు
'గూడ్స్ వాహనాల్లో ప్రయాణిస్తే కఠిన చర్యలు'


