హైదరాబాద్: 28°C
వార్తలు

అందుకే బీజేపీలో చేరా: హర్భజన్‌ సింగ్‌

ఇటీవల ఆమ్‌ ఆద్మీ పార్టీ రెబల్ ఎంపీ రాఘవ్‌ చడ్డాతో పాటు హర్భజన్ కూడా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ మారడంపై హర్భజన్ సింగ్ తొలిసారి స్పందించారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ వల్లే తాను పార్టీ మారాల్సి వచ్చిందని వెల్లడించారు. క్రీడాభివృద్ధి విషయంలో ఆప్‌లో తన మాటలకు తగిన గుర్తింపు లభించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.