హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్

తన ఆస్తుల వ్యవహారంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనితో పాటు హైకోర్టులోని కేసును మరొక చోటికి బదిలీ చేయాలని కోరుతూ ట్రాన్స్‌ఫర్ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం ఆగస్టు 17న విచారించనుంది. ఆస్తుల కేసులో తగిన ఆధారాలు లభిస్తే చట్టప్రకారం ఈడీ ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు ఆదేశించింది.