హైదరాబాద్: 28°C
వార్తలు

బాధిత కుటుంబానికి LOC చెక్కు అందజేత

GNTR: మంగళగిరి (మం) పెదవడ్లపూడి గ్రామానికి చెందిన నల్లబోతుల శ్రావ్యకు రూ.1,50,952 విలువైన ఎల్‌ఓసీ (LOC) చెక్కు మంజూరైంది. ఈ చెక్కును గురువారం టీడీపీ నాయకులతో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ జవ్వాది కిరణ్‌చంద్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందన్నారు.