హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలస్యమైతే అంబులెన్స్‌కు జరిమానా: NHAI

హైవే ప్రమాదాలపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్సులు 10 నిమిషాల్లోనే స్పందించాలని ఆదేశించింది. అంబులెన్సులు క్షతగాత్రుల్ని గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి తరలించాలని వెల్లడించింది. ఆలస్యమైతే రూ.10వేల జరిమానా విధిస్తామని అంబులెన్స్ యాజమాన్యాన్ని హెచ్చరించింది.