NLG: గుడిపల్లి మండలం సింగరాజుపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ భవనాల ద్వారా స్థానిక పరిపాలన మరింత బలోపేతమవుతుందని, ప్రజల అవసరాలు, సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించేందుకు ఇవి కీలకంగా నిలుస్తాయన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
వార్తలు
గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే


