హైదరాబాద్: 28°C
వార్తలు

అకాలీదళ్ చీఫ్‌పై దుండగులు దాడి

మహారాష్ట్ర నాందేడ్‌లో అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై కొంతమంది దుండగులు దాడి చేశారు. నాందేడ్‌లోని గురుద్వారా దర్శనానికి వచ్చిన ఆయనపై దాడి చేసి నిందితులు పరారయ్యారు. ఈ ఘటనలో ఆయన గాయపడడంతో వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.