హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ హామీల కమిటీ ఛైర్మన్‌గా శంకర్ నాయక్

NLG: తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలిలో జరిగిన ప్రాథమిక సమావేశంలో పాల్గొని కమిటీ కార్యకలాపాలపై చర్చించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, సభ్యులు ,భానుప్రసాద్, లెజిస్లేటివ్ సెక్రటేరియట్ అధికారులు శంకర్‌నాయక్‌ను అభినందించారు.