హైదరాబాద్: 28°C
వార్తలు

'లయన్స్ క్లబ్‌లు నూతన సభ్యత్వాలపై దృష్టి పెట్టాలి'

NZB: లయన్స్ క్లబ్‌లు నూతన సభ్యత్వాల చేరికపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పూర్వ గవర్నర్ ఈ వీరేశం సూచించారు. నిజామాబాద్ నగరంలోని సందీప్ గార్డెన్స్‌లో జరిగిన పీఎస్టీ రీజియన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నూతన సభ్యుల ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో రీజియన్ చైర్మన్ పి. హన్మాండ్లు, యాదగిరి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.