ADB: ఆదిలాబాద్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం భారీ జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించారు. వినాయక్ చౌక్ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడిలో దేశభక్తిని పెంపొందించడం, త్రివర్ణ పతాకం పట్ల గౌరవాన్ని చాటడం హర్ ఘర్ తిరంగా కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అన్నారు.
వార్తలు
బీజేపీ ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా'!


