TG: ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. 'నిజాలు మాట్లాడితే పార్టీ మారుతానంటున్నారు. మంచి పనులు చేసిన వారిని మర్చిపోకపోవడమే మానవత్వం. పోచారం ఎవరికీ అమ్ముడుపోయే వ్యక్తి కాదు. సీఎం రేవంత్‌ను నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిశా. ప్రజా సేవకే నా జీవితం అంకితం. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తా' అని పేర్కొన్నారు.
వార్తలు
పోచారం మరోసారి అసంతృప్తి వ్యాఖ్యలు


