హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రపంచ టాప్-5 నగరాల్లో అమరావతి ఉండాలి'

AP: హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలకు ధీటుగా అమరావతిని నిర్మించాలన్నది చంద్రబాబు విజన్ అని.. దానికి అనుగుణంగా నిర్మాణం సాగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా మాత్రమే కాకుండా ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామన్నారు. అమరావతిని ప్రపంచంలోని టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నదే తమ అభిమతమన్నారు.