హైదరాబాద్: 28°C
వార్తలు

పూలే విగ్రహాలను ఆవిష్కరించనున్న సీఎం

HYD: ఈ నెల 14న HMDA గ్రౌండ్స్ ఎదురుగా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగా, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని TGSGDCFL ఛైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య కోరారు.