AP: కర్ణాటక ప్రభుత్వం అందించిన.. 4 కుంకీ ఏనుగులతో సత్ఫలితాలు వస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇప్పటి వరకు కుంకీ ఏనుగులు 15 ఆపరేషన్లలో పాల్గొన్నాయని.. 70% పంట, ప్రాణ నష్టాన్ని నివారించడంతో ఇవి కీలక పాత్ర పోషించాయని పవన్ వెల్లడించారు. పార్వతీపురం మన్యంలో కుంకీలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. వన్యప్రాణుల రక్షణ కోసం 100 ప్రత్యేక వాహనాలను కేటాయిస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
కుంకీ ఏనుగులతో సత్ఫలితాలు: పవన్


