హైదరాబాద్: 28°C
వార్తలు

రైలులో ప్రయాణికుడికి పక్షవాతం

BHNG: నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో గురువారం తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న సిరిసిల్లకు చెందిన వెంకటయ్యకు బీబీనగర్ సమీపంలో పక్షవాతం వచ్చింది. తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది సమాచారంతో బీబీనగర్ 108 సిబ్బంది వెంటనే స్పందించారు. ఈఎంటీ బత్తిని రవికుమార్, పైలెట్ తాళ్లపల్లి నాగరాజు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.