హైదరాబాద్: 28°C
వార్తలు

క్యాబ్ బుకింగ్‌లో టిప్స్‌పై కేంద్రం నిషేధం

త్వరగా క్యాబ్ దొరుకుతుందని ఆశ చూపి టిప్స్ కోరవద్దని మోటార్ వెహికల్ అగ్రిగేటర్లను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఆదేశించింది. బుకింగ్ సమయంలో 'త్వరగా రైడ్ ఖరారవుతుంది' అంటూ వచ్చే సందేశాలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. ప్రయాణికులను ప్రోత్సహించే ఇటువంటి విధానాలు సరైనవి కావని పేర్కొంటూ, యాప్‌ల ద్వారా ముందస్తు టిప్ అడగకూడదని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.