హైదరాబాద్: 28°C
వార్తలు

గుమ్మలక్ష్మీపురంలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ

PPM: గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ రవికుమార్ నేతృత్వంలో విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీగా ఎల్విన్పేట జంక్షన్‌కు చేరుకుని మానవహారం చేపట్టారు. స్వాతంత్య్ర దినోత్సవం, వందేమాతరం 150వ వార్షికోత్సవం ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజేయడమే కార్యక్రమ ఉద్దేశమని ప్రిన్సిపాల్ తెలిపారు.