హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి

NZB: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని కంటేశ్వర్ ప్రాంతంలోని చిరు వ్యాపారుల దుకాణ సముదాయాలపై ఆయన స్వయంగా జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు.