AKP: పాయకరావుపేట మండలంలో నేతన్నసేవా పథకాన్ని అర్హులందరికీ వర్తింపజేయాలని స్థానిక మాజీ ఉపసర్పంచ్ జగతా శ్రీను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీడీవో శరత్ బాబును కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. మండలంలో అర్హులైన 40 మందికి ఈ పథకం అంద లేదన్నారు. దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
'నేతన్నసేవా పథకం వర్తింపజేయాలి'


