హైదరాబాద్: 28°C
వార్తలు

'సక్రమంగా వైద్య సేవలు అందించాలి'

ASR: కొయ్యూరు మండలం రత్నంపేట సబ్ సెంటర్‌ను గురువారం రాజేంద్రపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి డా. జగదీష్ నాయక్, పాడేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ మంగతల్లి సందర్శించారు. సబ్ సెంటర్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది, ఆశా వర్కర్లను ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ వృత్తి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.