హైదరాబాద్: 28°C
వార్తలు

ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల కాలంలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించగా, విపక్షాల ఆందోళనలు, రచ్చ నడుమ పలు దఫాలుగా వాయిదాల పర్వం కొనసాగింది. చివరి రోజు ప్రసంగాల అనంతరం స్పీకర్, ఛైర్మన్ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో మాన్సూన్ సెషన్ ముగిసింది.