BDK: అశ్వాపురం నుంచి మొండికుంట వరకు R&B ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పొడవునా పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణం నరకప్రాయంగా మారింది. రాత్రివేళ గుంతలు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని రామకృష్ణ ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.
వార్తలు
గుంతలమయంగా R&B రోడ్డు.. ప్రయాణం నరకప్రాయం..!


