AKP: దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ గిరిజనులు రేషన్ కోసం దూరం వెళ్లాల్సి వస్తోందంటూ గురువారం ఆందోళన చేపట్టారు. పలు గ్రామాల ప్రజలు 11 కి.మీ నడిచి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోడాపల్లిలో రేషన్ స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం నేతలు డిమాండ్ చేశారు.
వార్తలు
రేషన్ కోసం 11 కి.మీ నడకపై గిరిజనుల ధర్నా


