ఢిల్లీలో విపక్షాల నిరసనల తీరుపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభ వాతావరణాన్ని వారు పూర్తిగా చెడగొడుతున్నారని విమర్శించారు. హోంమంత్రిత్వ శాఖను రాహుల్ గాంధీ ప్రశ్నలు అడుగుతారు, కానీ వారిని సమాధానం చెప్పనివ్వరంటూ ఎద్దేవా చేశారు. విపక్షాలకు అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ లాంటి వాస్తవమైన సమస్యలేవీ లేవని, అందుకే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కంగనా దుయ్యబట్టారు.
వార్తలు
విపక్షాల తీరుపై కంగనా ఫైర్


