హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యసభలో దళిత రాజకీయం రగడ

ఉత్తరాఖండ్ ర్యాలీలో తాను వెళ్లాక స్టేజ్‌ను శుద్ధి చేశారని, బీజేపీది దళిత వ్యతిరేక మైండ్ సెట్ అని రాజ్యసభలో AICC చీఫ్ ఖర్గే ఆరోపించారు. దీనిపై సభలో గందరగోళం నెలకొనగా కేంద్రమంత్రి జేపీ నడ్డా బదులిచ్చారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని, దీనిని రాజకీయం చేయొద్దని కోరారు. స్టేజ్ శుద్ధి చేయడం తప్పేనని, వెంటనే విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. బీజేపీ ఇలాంటివి ప్రోత్సహించదన్నారు.