హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ షాపై కేసీ వేణుగోపాల్ ఫైర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శలు గుప్పించారు. అమిత్ షా స్పీకర్‌కు ప్రేమలేఖలు ఎందుకు రాస్తున్నారని, సభకు వచ్చి మాట్లాడేందుకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సభలో చర్చకు సిద్ధమని ఆయన చెప్పాలే తప్ప, ఇలా దాక్కోవడం సరికాదన్నారు. సభ వాయిదాలకు పూర్తిగా ప్రభుత్వమే కారణమని, బీజేపీ ఎజెండాను ప్రజలు తిప్పికొట్టారని మండిపడ్డారు.