హైదరాబాద్: 28°C
వార్తలు

కేరళలో రోడ్లు లేక అవస్థలు!

కేరళలోని ఇడుక్కి జిల్లాలో సాధారణ రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎడమలక్కుడికి చెందిన మలయప్పన్ అనే వ్యక్తి తీవ్ర జ్వరం, కడుపునొప్పితో బాధపడుతుండటంతో స్థానికులు ఆయనను తాత్కాలిక డోలీలో కిలోమీటర్ల మేర అడవి గుండా మోసుకెళ్లారు. భారీ వర్షాల వల్ల దారులు మూసుకుపోవడంతో అనాక్కులం వరకు నడిచి, అక్కడ నుంచి ఆటోలో తాలూకా ఆస్పత్రికి తరలించారు.