కోనసీమ: బీఎస్ మూర్తి రోడ్డులోని ప్రాదమిక పాఠశాల ఎదురుగా సిమెంటు డ్రెయిన్ ఆధ్వానంగా మారడంతో ఆందోళన నెలకొంది. విద్యార్థులు, స్థానికులు ఇక్కడి దుస్థితిపై కలవరపడుతున్నారు. ఇనుప చువ్వలు బయటకు తేలి రంద్రాలు పడిన చోట ఏమాత్రం పట్టుతప్పినా ప్రమాదం బారిన పడతామని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయాన్ని కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లగా డ్రెయిన్‌ను వెంటనే చక్కదిద్దేందుకు చర్యలు చేపడతామన్నారు.
వార్తలు
పాఠశాల ఎదుట డ్రెయిన్ అవస్థలు


