హైదరాబాద్: 28°C
వార్తలు

పడవ బోల్తా.. మత్స్యకారుడి మృతి

AP: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట తీరంలో విషాదం చోటు చేసుకుంది. చేపలవేటకు వెళ్లి తిరిగివస్తూ తెప్ప బోల్తాపడింది. ఈ ఘటనలో సూరాడ విశాఖ అనే మత్స్యకారుడు మృతి చెందాడు. మరో ఇద్దరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకారుడి మృతిపై ఎమ్మెల్యే గౌతు శిరీష విచారం వ్యక్తం చేశారు.