హైదరాబాద్: 28°C
వార్తలు

గుట్కా, పాన్ మసాలాపై నిషేధం

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పొగాకు, నికోటిన్‌తో కూడిన గుట్కా, పాన్ మసాలాల తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలపై ఏడాది పాటు పూర్తి నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఈనెల 10వ తేదీన కర్ణాటక రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు.