భారత పోస్టల్ శాఖ సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. అసోంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా పోస్టల్ బ్యాగుల డెలివరీని ప్రారంభించింది. 'స్కై ఎయిర్' సంస్థ భాగస్వామ్యంతో అసోం, హిమాచల్ ప్రదేశ్‌లో 150 రూట్లలో డ్రోన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 40 మార్గాలు అసోంలో ఉన్నాయి. మారుమూల, కొండ ప్రాంతాలకు వేగంగా పోస్టల్ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు.
వార్తలు
పోస్టల్ డెలివరీలో కొత్త శకం


