హైదరాబాద్: 28°C
వార్తలు

దివాకర్‌కు ప్రత్యేక అధికారి బాధ్యతలు

కోనసీమ: అమలాపురం మండలం కామనగరువు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా అమలాపురం తహసీల్దార్ వాసా సామ్యూల్ దివాకర్ ను నియమించారు. ఇప్పటివరకు ఇక్కడ ప్రత్యేక అధికారిగా పనిచేసిన డిప్యూటీ ఎంపీడీవో టీడీఏ శాస్త్రిని చిందాడగరువు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా నియమించారు. దీంతో కామనగరువు ప్రత్యేక అధికారిగా దివాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.