హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్వీ మోహన్ రెడ్డిని పరామర్శించిన కాటసాని

KRNL: అనారోగ్యంతో కర్నూలులోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న YCP జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని గురువారం పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్వీ కుటుంబ సభ్యులతో మాట్లాడి కాటసాని ధైర్యం చెప్పారు.