KRNL: ఆదోనిలో ఆవోపా, వాసవి క్లబ్ తదితర సంస్థల ఆధ్వర్యంలో 28వ విడత స్వర్ణామృత ప్రాశనం మందుల పంపిణీ నిర్వహించారు. వికాస తరంగిణి సహకారంతో 155 మంది చిన్నారులకు మందులను అందజేశారు. చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవోపా అధ్యక్షుడు వంకదారు శ్రీనాథ్ గుప్తా, సభ్యులు, పాల్గొన్నారు.
వార్తలు
28వ విడత స్వర్ణామృత ప్రాశనం మందుల పంపిణీ!


