హైదరాబాద్: 28°C
వార్తలు

రాళ్లు తేలి.. గుంతలు ఏర్పడి రోడ్డు అధ్వానం

PPM: కన్నయ్యవలస నుంచి చిట్టెలబకూడలి వరకు ఉన్న రహదారి పూర్తిగా దెబ్బతింది. రహదారిపై అడుగడుగునా గుంతలు ఏర్పడి, రాళ్లు పైకి తేలడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. గతంలో నిధులు వెచ్చించి నిర్మించిన ఈ రహదారి ప్రస్తుతం అధ్వానంగా మారడంతో, వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.