హైదరాబాద్: 28°C
వార్తలు

యువత కష్టపడి చదవాలి: సివిల్ జడ్జి

WG: నరసాపురం గౌతమి కళాశాలలో బుధవారం అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన నరసాపురం సీనియర్ సివిల్ జడ్జి జి. గంగరాజు మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, సమాజ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమన్నారు. విద్యార్థులు ప్రస్తుతం కష్టపడి చదువుకుంటే భవిష్యత్తులో సమాజంలో తలఎత్తుకుని జీవించవచ్చని వారికి హితవు పలికారు.