హైదరాబాద్: 28°C
వార్తలు

గుంటూరులో 32 ప్రభుత్వ వాహనాలకు వేలం

GNTR: గుంటూరు జిల్లాలో నిరుపయోగంగా ఉన్న 24 సంచార చికిత్స (104) వాహనాలు, మరో 8 ప్రభుత్వ వాహనాలను ఈనెల 26న వేలం వేయనున్నట్లు DMHO డాక్టర్ విజయలక్ష్మి బుధవారం తెలిపారు. జిల్లా కమిటీ నిర్ణయం మేరకు 'ఈ-కొనుగోలు' పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఆసక్తి గల వేలంపాటదారులు ఏపీ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో రుసుము చెల్లించి పాల్గొనాలని సూచించారు.