హైదరాబాద్: 28°C
వార్తలు

పొన్నూరులో విద్యుత్ శాఖ మెరుపు దాడులు

GNTR: పొన్నూరులో విద్యుత్ శాఖకు చెందిన విజిలెన్స్, ఆపరేషన్స్ విభాగాలు బుధవారం సంయుక్తంగా భారీ తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 38 బృందాలుగా ఏర్పడిన 38 మంది అధికారులు, 114 మంది సిబ్బంది పట్టణంలో 2,757 విద్యుత్ సర్వీసులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలిన 149 సర్వీసులపై అధికారులు రూ.5.34 లక్షల అపరాధ రుసుము (ఫైన్) విధించారు.