హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ నేత మహాదేవ్‌కు ఎమ్మెల్యే పరామర్శ!

KRNL: హనుమాన్ నగర్‌లోని బీజేపీ ఆదోని నార్త్ పట్టణ అధ్యక్షుడు వాల్మీకి మహాదేవ్‌ను ఎమ్మెల్యే పార్థసారథి బుధవారం ఆయన నివాసంలో పరామర్శించారు. అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న మహాదేవ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.