హైదరాబాద్: 28°C
వార్తలు

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి

NDL: వెల్దుర్తి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాంబాబును భరత్ గౌడ్ దూషించి, బెదిరించి దాడి చేసినట్లు పోలీసులు నిన్న తెలిపారు. పాఠశాల వివాదం నేపథ్యంలో శాంతిభద్రతల కోసం కానిస్టేబుల్‌ను అక్కడ నియమించారు. జేసీబీ నిర్వహణకు కూడా నిందితుడు ఆటంకం కలిగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.